Jagga Reddy: కుంగ్ ఫూ మాస్టర్ పోచయ్యను సన్మానించిన జగ్గారెడ్డి!

Jagga Reddy: అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కుంగ్ ఫూ మాస్టర్ పోచయ్యను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సత్కరించారు.

YOGANAND REDDY
Published on: 14 July 2026 11:59 PM IST
Jagga Reddy
X

Jagga Reddy: కుంగ్ ఫూ మాస్టర్ పోచయ్యను సన్మానించిన జగ్గారెడ్డి!

జగ్గారెడ్డి: పోచయ్యకు శాలువా కప్పి సన్మానించిన జగ్గారెడ్డి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు గోపాల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్.

కుంగ్ ఫూ కరాటే కటాలో అద్భుతమైన ప్రదర్శన చూపినందుకు, కేవలం అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించినందుకు 1,212 బృందానికి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఏప్రిల్ 26న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రదర్శన జరిగింది. మూడు రోజుల క్రితం అధికారికంగా రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్లను లండన్ నుంచి పంపించారు.

ఈ ప్రదర్శనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్ ఫు మాస్టర్ పోచయ్య తో పాటు అతని శిష్య బృంద సభ్యులు పాల్గొన్నారు. కుంగ్ ఫూ క్రీడకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిసారిగా పోచయ్య బృందం ఈ అరుదైన ఘనతను సాధించింది. గతంలో ఉన్న ప్రపంచ రికార్డు వీరు బద్దలు కొట్టారు. గతంలో గంటలో 600 మంది కలిసి 30 సార్లు కటా ప్రదర్శించారు. ప్రస్తుతం బృందం కేవలం అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

ఈ సందర్భంగా మంగళవారం సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పోచయ్య కలిశారు. తాము నెలకొల్పిన రికార్డు గురించి ఆయనకు వివరించారు. అభినందించు ఈ విషయమై సంతోషం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి, పోచయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story