Hyderabad: హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం!
Hyderabad: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.
Hyderabad: హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం!
Hyderabad: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున తీవ్ర విషాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ భీకర ప్రమాదంలో బస్సు ముందరి భాగం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన 20 మందిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాద ధాటికి రహదారిపై కాసేపు రాకపోకలు నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




