Uday Krishna Reddy: మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు: ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
Uday Krishna Reddy: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Uday Krishna Reddy: మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు: ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
Uday Krishna Reddy: సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఉప్పరపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులతో ఉప్పరపల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (SVPNPA) లో తనపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జులై 18న అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.




