Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
Uday Krishna Reddy: హైదరాబాద్‌లో కలకలం. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు.
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
Uday Krishna Reddy: భాగ్యనగరంలో ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు యత్నించడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తోటి మహిళా అధికారి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో కేసు నమోదు కావడం, ఆపై తీవ్ర డిప్రెషన్‌కు లోనవడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఎర్రగడ్డ మోతీనగర్‌లోని తన సోదరుడి నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి, ఆయనను చికిత్స నిమిత్తం ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ నిర్ణయానికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే.. నిన్ననే ఉదయ్ కృష్ణారెడ్డిపై ఒక సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కృష్ణారెడ్డిపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఉన్నతమైన పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి తీవ్రమైన కేసు నమోదు కావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి, డిప్రెషన్‌కు గురయ్యారు. అదే మానసిక ఆందోళనలో సోదరుడి ఇంటికి వెళ్లిన ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




