RTC Strike: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి..!

RTC Strike: ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. 32 అంశాల్లో 29 పరిష్కారానికి సిద్ధమని, కమిటీ నివేదిక రాగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 22 April 2026 2:41 PM IST
RTC Strike
X

RTC Strike: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి..!

RTC Strike: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణతో పాటు ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు విధుల్లోకి చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె మాత్రమే పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 సమస్యలు వెంటనే పరిష్కరించదగినవిగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి కీలక అంశాలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులు మొండివైఖరి వీడి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story