Kavitha: కేటీఆర్, హరీష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఈ జన్మలో అధికారంలోకి రాదు!
Kavitha: బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లను అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
Kavitha: కేటీఆర్, హరీష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఈ జన్మలో అధికారంలోకి రాదు!
Kavitha: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు మరియు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ అమరుల కుటుంబాలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు ఆ డబ్బు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది కాదా? అని ఆమె నిలదీశారు. ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో పర్యటించిన కవిత, అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీకి అసలు నీతినియమాలు లేవని మండిపడ్డారు. తల్లి, చెల్లి అనే కనీస సభ్యత కూడా మరిచి బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ (టీఆర్‌ఎస్) అంటే భయం లేదంటూనే, ఎన్నికల కమిషన్‌కు (EC) వెయ్యికి పైగా ఫిర్యాదులు ఇచ్చారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అనే పేరు తనకు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన కంఠంలో ప్రాణముండగా మళ్లీ ఎప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. తన పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా చేతులు కలిపాయని విమర్శించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను లక్ష్యంగా చేసుకుని కవిత పలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్ ప్రోకో కింద కేటీఆర్ అక్రమ పర్మిషన్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, ఇటీవల రూ.188 కోట్లు వెచ్చించి ఒక ఇంగ్లిష్ పత్రికను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఫీనిక్స్ సంస్థకు రూ.80 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని, ఆ సంస్థ ఏకంగా రూ.33 లక్షల టన్నుల కలపను కొట్టేస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో హరీశ్‌రావు ఒక 'అనకొండ' లాంటివారని కవిత అభివర్ణించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికీ ఆయన్నే ముందు పెడుతోందని, పెద్దాయనకు సైతం మరకలు అంటించిన హరీశ్‌రావుకు ఇప్పుడు 3 నెలలు మంత్రి పదవి కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ జన్మలో బాగుపడదని, ఇక ఏనాడూ అధికారంలోకి రాబోదని కవిత జోస్యం చెప్పారు.




