TS EAPCET Results: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే?
TS EAPCET Results: జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET 2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
TS EAPCET Results: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే?
TS EAPCET Results: జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET 2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ హెచ్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవ్ రావు ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలు మే 4 నుంచి 11 వరకు నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగగా, ఇంజినీరింగ్ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో 84,954 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాప్ ర్యాంకర్లు వీరే
ఈసారి ఇంజినీరింగ్ విభాగంలో ఉప్పల్‌కు చెందిన ఎం. రుషి తొలి ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. హైదరాబాద్ మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో ర్యాంక్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులకు చెందిన ఎం. వంశీధర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచాడు.
గుంటూరుకు చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి నాలుగో ర్యాంక్ సాధించగా, మహబూబ్‌నగర్‌కు చెందిన సాయి నిఖిత్ ఐదో ర్యాంక్ పొందాడు. మేడ్చల్‌కు చెందిన అస్మా ఆరో ర్యాంక్, బంజారాహిల్స్‌కు చెందిన వివాన్ శరద్ మహేశ్వరి ఏడో ర్యాంక్ సాధించారు. అలాగే కొండాపూర్‌కు చెందిన శ్రేయస్ రెడ్డి, ఎల్‌బీనగర్‌కు చెందిన సమీరాజ్ రెడ్డి, జీడిమెట్లకు చెందిన జయంత్ శేఖర్ వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది ర్యాంకులు పొందారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ విద్యార్థుల ఆధిపత్యం
అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముక్కరం అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఎర్రమంజిల్‌కు చెందిన నివృత్త్ సాయి వెంకట్ రెండో ర్యాంక్ పొందగా, రంగారెడ్డి జిల్లా ఆల్మాస్‌గూడకు చెందిన సాహితి గీతిక గుంతి మూడో స్థానంలో నిలిచింది. టాప్-10లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు కూడా స్థానం సంపాదించారు.
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్
ఫలితాల విడుదలతో నేపథ్యంలో.. వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు ప్రక్రియపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://eapcet.tgche.ac.in/ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.




