Korutla: కోరుట్ల రైతు కంట కన్నీరు.. గాలివాన మిగిల్చిన ఆవేదన!
Korutla: కోరుట్ల నియోజకవర్గంలో అకాల గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడి తోటలు నేలరాలగా, ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయ్యింది.
Korutla: కోరుట్ల రైతు కంట కన్నీరు.. గాలివాన మిగిల్చిన ఆవేదన!
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా కురిసిన గాలివాన రైతులను తీవ్రంగా నష్టపరిచింది. బలమైన ఈదురు గాలులతో పాటు వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం మామిడి పంటనే కాయలు సరిగా కాయక నష్టపోయామనుకుంటే అకాల వర్షంతో రైతన్నలు మరింత నష్టపోతున్నారు. మామిడి తోటల్లో పెద్దఎత్తున పండ్లు నేలరాలిపోయాయి. ఇప్పటికే కోతకు సిద్ధమైన మామిడి పంట ఒక్కసారిగా నేలకూలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలమైన గాలులకు అక్కడక్కడ వరిపంట నేలకొరిగింది. ఆరబెట్టిన పసుపు వర్షానికి తడిసి నాణ్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్టిన ఖర్చులు కూడా రాబట్టలేమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి,బాధిత రైతులకు పరిహారం అందించాలని రైతన్నలు కోరుతున్నారు.
Next Story




