Karimnagar: రాజకీయాలకతీతంగా అభివృద్ధి: కరీంనగర్ చెరువుల పునరుజ్జీవనానికి భారీ నిధులు

Karimnagar: కరీంనగర్‌లో అమృత్ 2.0 పథకం కింద అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. చెరువుల పునరుజ్జీవనం, నగర సుందరీకరణే లక్ష్యమని వెల్లడి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Updated on: 20 April 2026 11:49 AM IST
Karimnagar
X

Karimnagar: రాజకీయాలకతీతంగా అభివృద్ధి: కరీంనగర్ చెరువుల పునరుజ్జీవనానికి భారీ నిధులు

కరీంనగర్: అమృత్ 2.0 మంచినీటి వనరుల పునర్జీవన పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. చెరువుల కి వచ్చి చేరుతున్న కలుషితమైన నీటిని డ్రైనేజీ వాటర్ ను తొలగించి చెరువులో మంచినీటి వనరులు కల్పించే సదుద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులను చేపట్టి నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో భాగంగా తీగలగుట్ట పల్లిలో గల మాల చెరువు అభివృద్ధి కోసం ఒకటి1.21 లక్షలు, కొత్తపెళ్లి చదువుకి 2.83 లక్షల కోట్ల నిధులతో సుందరీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఐదు కోట్ల నిధులతో మూడు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రజల అవసరాల దృశ్య గణేష్ నిమజ్జనం, బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తే కేంద్ర నిధులు రాష్ట్ర నిధులతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తామన్నారు. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అని అందుకే రాజకీయాలకతీతంగా కలిసి పనిచేయాలని కోరారు. నగరాన్ని అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదామని అన్నారు.

అమృత్ 2.0 పథకం కింద లో ఉన్న చెరువులు కుంటలు పునర్జీవనం చేయడం కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.మంచినీటి వనరులు ఏర్పడితే వ్యవసాయం, మంచినీటి కొరత తీరుతాయని అన్నారు. చెరువులను కలుషితం చేసే కాలువలను దారి మళ్లించి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. గతంలో చెరువులు కుంటలు బావుల నుండి మంచినీరు తాగేవారని అలాంటి పరిస్థితిని తీసుకురావాలంటే భూగర్భ జలాలను కలుషితం చేయకూడదని భూగర్భ జలాలు కలుషితమైతే నీటి వనరులు కొరత ఏర్పడుతుందన్నారు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మంచినీటి పునర్జీవన కోసం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story