Bandi Sanjay: రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రేవంత్ రాహువు అయితే, కేసీఆర్ కేతువు అని అభివర్ణించారు.

Arun Chilukuri
Published on: 21 April 2026 11:47 AM IST
Bandi Sanjay
X

Bandi Sanjay: రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, వారిద్దరినీ 'రాహు-కేతువుల'తో పోల్చారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని బండి సంజయ్ మండిపడ్డారు. "గతంలో లక్ష కోట్ల అవినీతి అన్న రేవంత్.. ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖలో రూ.9 వేల కోట్లని ఎందుకు పేర్కొన్నారు? ఆ లేఖలను కరపత్రాలుగా ముద్రించి ఇంటింటికీ పంచుతాం" అని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అని ఆయన నిలదీశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వమని బండి సంజయ్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబంలోని మహిళలకు పదవులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మహిళా బిల్లు వీగిపోవడానికి స్టాలిన్, రేవంత్ రెడ్డే కారణమని, బిల్లు వీగితే రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చూపు రాహుల్ గాంధీ సీటుపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికీ కలవవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై వస్తున్న వార్తలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story