JP Nadda: బీబీనగర్ ఎయిమ్స్ టు బీజేపీ ఆఫీస్: కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఫుల్ షెడ్యూల్ ఇదే!

JP Nadda Telangana Visit: కేంద్ర మంత్రి జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Updated on: 9 July 2026 11:13 AM IST
JP Nadda
X

JP Nadda: బీబీనగర్ ఎయిమ్స్ టు బీజేపీ ఆఫీస్: కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఫుల్ షెడ్యూల్ ఇదే!

JP Nadda Telangana Visit: కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్‌ ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. అలగే మధ్యాహ్నం 12 గంటల నుంచి.. 1.30 గంటల వరకు ఎయిమ్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బీబీనగర్‌ ఎయిమ్స్‌ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బీజేపీ ఆఫీస్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలలకు బీజేపీ రాష్ట్ర కార్యలయం నుంచి తాజ్‌ డెక్కన్‌కు వెళ్లనున్నారు. తాజ్‌ డెక్కన్‌ నుంచి 7 గంటల 10 నిమిషాలకు బయలుదేరి శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌కు వెళ్లనున్నారు. అలగే రాత్రి 9 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి జేపీ నడ్డా వెళ్లనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story