Dichpally: అకాల వర్షంతో అన్నదాత విలవిల.. భారీ పంట నష్టం
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
Dichpally: అకాల వర్షంతో అన్నదాత విలవిల.. భారీ పంట నష్టం
డిచ్ పల్లి న్యూస్: డిచ్ పల్లి మండల సుద్ద పల్లి గ్రామం లో వడగండ్ల వానతో భారీగా నష్టపోయిన వరి రైతులు..వడగండ్ల వానతో వందల ఎకరాల్లో వరి, మామిడి తోట లకు భారీగా నష్టం జరిగింది..ఆందోళనలో వరి, మామిడి తోట రైతులు .. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది.
అదే సమయంలో, మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. ఈదురు గాలుల ప్రభావంతో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.. దీంతో రైతులకు రెండింతల నష్టం వాటిల్లింది.పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు, అకాల వర్షాలతో పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెండకాయ పంట, నువ్వు పంట రాత్రి పడ్డ వడగండ్ల వర్షానికి నేలకోరుగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయ అధికారులకు పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరారు. ప్రభుత్వమే చొరవ తీసుకొని నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని రైతులకు కోరారు.




