Nizamabad: అకాల వర్షం.. అపార నష్టం.. జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 19 April 2026 6:42 PM IST
Nizamabad
X

Nizamabad: అకాల వర్షం.. అపార నష్టం.. జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి, సిరికొండ మండలంలోని తాటిపల్లి, కుర్థులపేట లో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో మోస్తరు వర్షం కురిసినప్పటికీ కేవలం సిరికొండ మండలం లో పలు గ్రామలలో వడ గండ్లు పడడంతో పంట దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.

సిరికొండ మండలం సర్పల్లి తండా, తాళ్ల రామ డుగు, మూషీనగర్, గడ్కోల్, కొండూర్, రావుట్ల తదితర గ్రామాల్లో ధాన్యం తడిది ముద్దయ్యింది. వరి పైరు నేలవాలింది. ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు.కొన్నిచోట్ల వడగళుల పడటంతో కోతకు వచ్చిన ధాన్యంతో పాటు కూరగాయల పం టలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story