Kapra Lake: కాప్రా చెరువుకు కొత్త కళ.. పర్యవేక్షించిన కాంగ్రెస్ నేతలు

Kapra Lake: కాప్రా చెరువు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసింది.

ASHOK, KAPRA
Published on: 17 April 2026 7:28 PM IST
Kapra Lake
X

Kapra Lake: కాప్రా చెరువుకు కొత్త కళ.. పర్యవేక్షించిన కాంగ్రెస్ నేతలు

Kapra Lake: కాప్రా చెరువు అభివృద్ధి పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు స్వర్ణ రాజు, బొంతు శ్రీదేవి యాదవ్ తో పాటు అధికారులతో కలిసి చెరువును సందర్శించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా‌ వారు మాట్లాడుతూ, త్వరలోనే చెరువులో సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

అలాగే ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులు రూ.20 కోట్లతో తుదిదశలో ఉన్నాయని, నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు (రూ.30 కోట్లు), రామంతాపూర్ పెద్ద చెరువు (రూ.17 కోట్లు) అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు,ఇరిగేషన్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్ శివమణి, సింగిరెడ్డి ధన్ఫల్ రెడ్డి, పావని రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతా రామ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story