Uppal: ఫలించిన ఎమ్మెల్యే కృషి.. నెరవేరిన ఉప్పల్ ప్రజల ఆకాంక్ష

Uppal: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి రూ. 98 కోట్ల నిధులు మంజూరు. ఉప్పల్ భాగ్యత్ లో 10 ఎకరాల్లో నిర్మాణం.

ASHOK, KAPRA
Published on: 13 April 2026 9:26 PM IST
Uppal
X

Uppal: ఫలించిన ఎమ్మెల్యే కృషి.. నెరవేరిన ఉప్పల్ ప్రజల ఆకాంక్ష

Uppal: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు శాశ్వత కార్యాలయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 98 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేయడం పట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఉప్పల్ భాగ్యత్ లేఅవుట్ ఫేజ్-IIIలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కార్యాలయ భవనం, ప్రాంతీయ ప్రజలకు మరింత మెరుగైన పౌరసేవలు అందించేందుకు దోహదపడుతుందని త్వరలోనే శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కి, సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మొదట స్థలాన్ని పరిశీలన చేశాం అని ఉప్పల్ అభివృద్ధి దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటుగా బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story