Uppal: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వివాదం.. ఎమ్మెల్యే తీరుపై వెల్లువెత్తిన ఆగ్రహం
Uppal: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Uppal: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వివాదం.. ఎమ్మెల్యే తీరుపై వెల్లువెత్తిన ఆగ్రహం
Uppal: కేంద్ర ప్రభుత్వ నిధుల తో నిర్మిస్తున్న ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ విషయం లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా చర్లపల్లి డివిజన్లోని చక్రిపురం చౌరస్తాలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించే నిర్మాణ లకు వాజ్పేయి పేరు పెడితే బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారని కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపస్ తీసుకొని బహిరంగంగా ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ కి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డ్ సభ్యులు డి.నాదం,ఎం లక్ష్మణ్ గౌడ్, ఉప్పల్ అసెంబ్లీ బిజెపి మీడియా సెల్ కన్వీనర్ తాళ్ల ఆనంద్ గౌడ్, చర్లపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాసుల సురేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఇస్లావత్ హరినాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షులు రామకృష్ణ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ ,S.అశోక్ ,శంకర్ వంశరాజ్, సహదేవ్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు వి రాంబాబు, శ్రీకాంత్ ,రాజేష్ వంశరాజ్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.




