వాహనదారులకు అలర్ట్: మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేత.. ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

Uppal Ring Road: హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డును మూడు నెలల పాటు తాత్కాలికంగా మూసివేస్తూ ట్రాఫిక్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 18 May 2026 4:45 PM IST
UPPAL RING ROAD
X

వాహనదారులకు అలర్ట్: మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేత.. ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా రింగ్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోఉండనున్నాయి. మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్నామ్నాయ మార్గాలు సూచించారు. హబ్సీగూడ నుంచి వచ్చి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూలు వెనక నుంచి బీరప్పగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవచ్చు. నాగోలు, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలు హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్ పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కానీ లేదా సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లి ఘట్ కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారి మీదకు వెళ్లొచ్చు. ఫిర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాక ముందు లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ దగ్గర యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫిర్జాదిగూడ నుంచి నాగోలు వెళ్లాలంటే ఉప్పల్ భగాయత్ లే అవుట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. హబ్సీగూడ నుంచి నాగోలు వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story