Telangana: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్

Telangana: నీట్ పేపర్ లీకేజీల నిరసనగా ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ను ఖండిస్తూ ఈనెల 24న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు USFI పిలుపునిచ్చింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 22 July 2026 8:09 PM IST
Telangana
X

Telangana: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్

కరీంనగర్: నీట్ పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న వారిపట్ల బీజేపీ ప్రభుత్వం దీక్ష భగ్నం మరియు పార్లమెంటు ముట్టడి సందర్భంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు USFI జిల్లా కార్యదర్శి సంద గణేష్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యార్థి యువతుల పట్ల లాటి చార్జ్ చేసిందని దీన్ని అన్ని వర్గాల వరకు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర విద్యా శాఖ మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుండి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 30 రోజులుగా దీక్షలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలవకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే విద్యాశాఖ మంత్రిని తొలగించాలని అదేవిధంగా ఎన్ టి ఏ ను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా లాఠీచార్జిలో అసాంఘిక శక్తులు చేరబడి లాఠీచారి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరార. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని దీక్ష చేస్తున్న వారి దీక్ష వద్దకు వెళ్లి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 24న జరిగే రాష్ట్ర బంద్ లో అన్ని వర్గాల వారు పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story