Hyderabad: పని ప్రదేశాల్లో భద్రత కల్పించండి హైదరాబాద్‌లో బజరంగ్ దళ్ నిరసన!
Hyderabad: నాసిక్ టీసీఎస్ సంస్థలో జరిగిన మహిళా వేధింపుల ఘటనపై మైలార్‌దేవ్‌పల్లిలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నిరసన. బాధితులకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్.
Hyderabad: పని ప్రదేశాల్లో భద్రత కల్పించండి హైదరాబాద్‌లో బజరంగ్ దళ్ నిరసన!
శంషాబాద్: నాసిక్‌లోని Tata Consultancy Services (TCS) కార్పొరేట్ సంస్థలో మహిళలపై జరిగిన వేధింపుల ఘటనను ఖండిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని మరియు దోషులను కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ చౌరస్తా వద్ద కార్పొరేట్ లవ్ జిహాద్”ను అరికట్టాలని పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్పొరేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు సహా హిందూ మహిళలు పనిచేసే ప్రతి చోట భద్రత అవసరమని తెలిపారు. హిందూ మహిళల రక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ కృషి చేస్తాయని వారు పేర్కొన్నారు.




