ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సీరియస్ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందే
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. అర్జీలను స్వీకరించి, పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సీరియస్ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందే
వికారాబాద్: పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కొరకు వచ్చిన వారి ఫిర్యాదులను పూర్తి స్థాయి లో పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 135 పిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పూర్తి స్థాయి లో పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖ ల వారిగా డి పి ఓ ,పంచాయతీ రాజ్, గృహ నిర్మాణము డీఆర్‌డీఏ, ప్రణాళిక శాఖ, భూ సేకరణ విభాగాలకు చెందిన అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై వివరణ ఇవ్వాలని కోరారు. వారంలోపు అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్‌లో ఉన్నవి వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.
99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ , జిల్లా స్థాయిలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రజలు,.ప్రజా ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమాలను తప్పని సరిగా ఫోటోలు పంపించాలని సూచించారు. ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు , వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో అప్లోడ్ చేయాలని, ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రాజేశ్వరి ,జడ్.పి సి ఇ ఓ సుధీర్, డి ఆర్ ఓ మంగీ లాల్ ,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ ,ఆర్ డి ఓ వాసు చంద్ర,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




