Vikarabad: విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యమైన వైద్యమే ప్రాధాన్యం.. కలెక్టర్

Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీలు. ఎస్సీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ ఆసుపత్రి మరియు రేషన్ షాపులను సందర్శించి వసతులపై సమీక్ష.

MOGULAIAH, VIKARABAD
Published on: 10 April 2026 7:55 PM IST
Vikarabad
X

Vikarabad: విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యమైన వైద్యమే ప్రాధాన్యం.. కలెక్టర్

Vikarabad: శుక్రవారము జిల్లాలోని మండల కేంద్రంలో గల సాంఘీక సంక్షేమ ఎస్సి బాలుర వసతి గృహాన్ని సందర్శించి తరగతి తరగతి గదులు, భోజనశాల, వంట గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలో వంటశాల, సామాగ్రి నిల్వగదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు.

విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిగది లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరు శాతం , సిబ్బంది, వసతి గృహం లో ఉండే మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసు కున్నారు.

అనంతరము వికారాబాద్ పట్టణం లోని ఇందిరా నగర్ రేషన్ షాప్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు సరఫరా అవుతున్న నిత్యావసర సరుకులు, బియ్యం, చక్కెర, తదితర వస్తువుల పంపిణీ విధానాన్ని సమీక్షించారు. స్టాక్ రిజిస్టర్, పంపిణీ రికార్డులను పరిశీలించి సరుకులు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని తనిఖీ చేశారు.

లబ్ధిదారులకు ఏప్రిల్, మే , జూన్ మూడు నెలలకు సంబంధించి బియ్యాన్ని ఒకేసారి తూకం చేసి ఇచ్చే విధానాన్ని పరిశీలించారు. నాణ్యమైన సరుకులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తదనంతరము జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, ఔషధాల లభ్యతపై సమగ్రంగా పరిశీలించారు. వివిధ వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను తనిఖీ చేశారు.

రోగులకు సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సి వెల్ఫేర్ అధికారి జయపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమాదేవి, డి ఎం సి ఎస్ మురళీకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి సుపరింతెన్దేంట్ రాజ్య లక్ష్మి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story