Tandur: తాండూరులో ప్రత్యేక అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి
Tandur: తాండూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు రూపొందించిన కార్యాచరణ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు
Tandur
Tandur: తాండూరు మండలాన్ని భివృద్ధి పథంలో నిలిపేందుకు రూపొందించిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తీవారీ అధికారులను ఆదేశించారు. తాండూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు.
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల సందర్శనలో భాగంగా పలు సమస్యలను గుర్తించామని, 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపుతామని కలెక్టర్ అన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకుప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నెలకొన్న డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల సమస్యలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలనుపరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులు సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అభివృద్ధి పనులలో భాగంగా నిర్మాణ పనులకు ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటికే అంచనాలు రూపొందించామన్నారు. వారం రోజుల్లో నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కావని, ఇందులోప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని దీపక్ తివారి కోరారు. అన్ని శాఖల సమన్వయంతో తాండూరు ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.




