Vikarabad: షార్ట్ టర్మ్ కోర్సులతో మెరుగైన ఉపాధి.. ఏ.టి.సి ఇన్చార్జి
Vikarabad: వికారాబాద్ ప్రభుత్వ ఐ.టి.ఐ లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద మూడవ బ్యాచ్ సాంకేతిక శిక్షణ ప్రారంభం కానుంది.
Vikarabad: షార్ట్ టర్మ్ కోర్సులతో మెరుగైన ఉపాధి.. ఏ.టి.సి ఇన్చార్జి
Vikarabad: వికారాబాద్ లోని ప్రభుత్వ ఐ.టి.ఐ/ ఏ.టి.సి లో 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మూడవ బ్యాచ్ తేది :20-04-2026 నుండి 02-05-2026 పలు షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎ.టి.సి ఇన్చార్జి .ఎస్.ఏం.సరూష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా. సి.ఎన్.సి లేత్ మిషన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, సి.ఎన్.సి మిల్లింగ్ మిషన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్,
ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ పై అవగాహన కోర్సు, జూనియర్ రోబోట్ ఆపరేటర్- ప్రోగ్రామర్ (ఆర్క్ వెల్డింగ్), ఎలక్ట్రికల్ వెహికల్ పై బేసిక్ కోర్స్ , క్యాడ్ 2డి మరియు 3డి ఫీచర్స్ ఉపయోగించి జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ వంటి కోర్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని సంపాదించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచు కోవచ్చని తెలిపారు,
ఈ కోర్సులకు 10వ తరగతి ,ఐటిఐ , డిప్లొమా, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం ప్రభుత్వ ఎ.టి.సి/ ఐటిఐ వికారాబాద్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అలాగే ఈ 9177472488, 9550112364 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ.టి.సి ఇన్చార్జి ఎస్.ఎమ్. సరూష్ గారు తెలియజేయడం జరిగింది ఈ కోర్సులకు 7 బ్యాచ్ లలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.




