Nalgonda: చారిత్రక సూర్య దేవాలయ పునరుద్ధరణకు అంకురార్పణ

Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ప్రాచీన సూర్య దేవాలయ పునరుద్ధరణకు ప్రముఖులు, గ్రామస్థులు శ్రీకారం చుట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 3 April 2026 7:31 PM IST
Nalgonda
X

Nalgonda: చారిత్రక సూర్య దేవాలయ పునరుద్ధరణకు అంకురార్పణ

Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ప్రాచీన సూర్య దేవాలయ పునరుద్ధరణకు గ్రామస్థులు, ప్రముఖులు నడుం బిగించారు. చోళుల కాలంలో నిర్మితమై, తెలంగాణలోనే తొలి సూర్య దేవాలయంగా పేరుగాంచిన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ జీర్ణోద్ధరణపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ నుంచి ఆశించిన స్పందన లభించకపోవడంతో స్థానికులే ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.

​హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రవీందర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది కరుణాకర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు పైళ్ల వీరమన్మధ రెడ్డి తదితరులు ఈ పునరుద్ధరణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సప్తపది బృందం పర్యవేక్షణలో ఆలయ వాస్తు, నూతన డిజైనింగ్, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు త్వరలోనే చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story