Telangana: ఇంట్లోకి చొరబడి కూల్‌గా కూల్‌డ్రింక్ తాగుతూ దొంగతనం చేశారు.. కట్ చేస్తే..
Telangana: దొంగలు ఎవరైనా ఇళ్లలో చొరబడినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా, చప్పుడు కాకుండా అందిన కాడికి దోచుకుని పారిపోవాలని చూస్తారు.
Telangana: ఇంట్లోకి చొరబడి కూల్‌గా కూల్‌డ్రింక్ తాగుతూ దొంగతనం చేశారు.. కట్ చేస్తే..
Telangana: దొంగలు ఎవరైనా ఇళ్లలో చొరబడినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా, చప్పుడు కాకుండా అందిన కాడికి దోచుకుని పారిపోవాలని చూస్తారు. కానీ, కొందరు దొంగలు మాత్రం తమదే ఇల్లన్నట్లు ఎంతో దర్జాగా, నిదానంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా తెలంగాణలో ఇలాంటి విచిత్రమైన ఘటనే ఒకటి వెలుగుచూసింది.
ఇల్లు తాళం వేసి ఉండటంతో చోరీ చేయడానికి లోపలికి చొరబడిన దొంగలు.. తీరిగ్గా ఫ్రిజ్ ఓపెన్ చేసి కూల్ డ్రింక్ తాగుతూ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే నాగేశ్, మాధవి దంపతులు తమ ఇంటికి తాళం వేసి ఖమ్మం వెళ్లారు. వారు ఇంట్లో లేని సమయం చూసి ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు.
ఇంట్లోకి వెళ్లగానే అందులో ఒక దొంగకు బాగా దాహం వేసిందేమో, నేరుగా వెళ్లి ఇంట్లోని ఫ్రిజ్ తలుపు తీశాడు. అందులో ఉన్న కూల్ డ్రింక్ తీసుకుని.. దాన్ని తాగుతూనే ఇల్లంతా కలియతిరుగుతూ ఎంతో కూల్‌గా దొంగతనం చేశాడు. ఇంట్లో ఎవరూ లేరన్న ధైర్యంతో వారు ఏమాత్రం భయం లేకుండా ఈ చోరీని ముగించారు.
ఈ దొంగతనంలో వారు ఏకంగా 60 తులాల వెండి, 15 గ్రాముల బంగారం, ఇంట్లో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారు. ఖమ్మం నుంచి తిరిగి వచ్చిన ఇంటి యజమానులు దొంగతనం జరిగిందని గుర్తించి షాక్ అయ్యారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అందులో ఈ దొంగలు కూల్ డ్రింక్ తాగుతూ చోరీ చేసిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదెక్కడి చోరీ రా బాబు అంటూ నెటిజన్లు ఈ దృశ్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు.




