Gangadhara: అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వరి పంటలు!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
Gangadhara: అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వరి పంటలు!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి పంటకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ బావుల్లో పేరుకుపోయిన మట్టిని క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. నీటి నిల్వలు పెరగాలని ఆశిస్తూ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి బావులను శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా, మరింత నీరు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బావుల పక్కనే సైడ్ బోర్లు కూడా వేయిస్తున్నారు.
వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రైతు నందగిరి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “వరి పంటకు నీరు సరిపోకపోవడంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి సైడ్ బోర్ వేయించుకున్నాం. అయినప్పటికీ నీటి సమస్య పూర్తిగా తీరడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.




