Malla Reddy: కారు దిగుతున్న మల్లారెడ్డి? తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్!

Malla Reddy: మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా?

Arun Chilukuri
Updated on: 20 July 2026 11:14 AM IST
Malla Reddy
X

Malla Reddy: కారు దిగుతున్న మల్లారెడ్డి? తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్!

Malla Reddy: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ పై జోరుగా చర్చించుకుంటున్నారు. కొంత కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువసంగ్రామ సదస్సులోనూ సైతం మల్లారెడ్డి పాల్గొనలేదు. అదే రోజు సాయంత్రం ఘటకేసర్‎లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభా వేదికపై మల్లారెడ్డి ప్రత్యక్షం అయ్యారు.

ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా.. స్టేజీమీద కుర్చున్న మల్లారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండటం గులాభీనేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ ఏం బ్లాక్ మెయి చేశాడని ఇప్పుడు సైలంట్ అయ్యావ్ మల్లన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

మరో వైపు మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం కొనసాగుతుంది. మల్లారెడ్డి తీరుపై బీఆర్ఎస్ మద్దతు దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అదిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story