Telangana: మరీ ఇలా ఉన్నారేంటండీ బాబూ.! వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారని..
WhatsApp Group: ఏదైనా నేరం లేదా గొడవలు జరిగితే పోలీసుల దగ్గరకు వెళ్లడం సహజం. కానీ, హైదరాబాద్‌లో ఓ మహిళ తనను వాట్సాప్ గ్రూప్ నుంచి..
Telangana: మరీ ఇలా ఉన్నారేంటండీ బాబూ.! వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారని..
WhatsApp Group: ఏదైనా నేరం లేదా ఘర్షణ జరిగితే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడం చాలా కామన్ విషయం. కానీ, తెలంగాణలో జరిగిన ఓ విచిత్రమైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనను వాట్సాప్ గ్రూప్‌లో మళ్లీ యాడ్ చేయలేదని ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న NBT నగర్ బస్తీ వాసులు ఒక వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రూపులో ప్రధానంగా బస్తీకి సంబంధించిన స్థానిక సమస్యలపై మాత్రమే చర్చిస్తుంటారు. ఈ క్రమంలో గ్రూపులో ఎలాంటి పొలిటికల్ మెసేజ్‌లు పెట్టొద్దని ఆ గ్రూప్ అడ్మిన్ సభ్యులకు సూచించాడు.
కానీ, అడ్మిన్ చెప్పినా వినకుండా ఓ మహిళ.. ఆ బస్తీ గ్రూపులో ఒక రాజకీయ పోస్ట్ పెట్టింది. గ్రూప్ నియమాలను ఉల్లంఘించినందుకు గాను అడ్మిన్ వెంటనే ఆమెను ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. అయితే తనను మళ్లీ గ్రూపులో యాడ్ చేయాలని ఆమె కోరినప్పటికీ, యాడ్ చేయకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. చిన్న వాట్సాప్ గ్రూప్ గొడవకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ విచిత్రమైన వార్త కాస్తా ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.




