Bichkunda: పరిశోధన పద్ధతుల్లో వినూత్న మార్పులు.. విద్యావేత్తల సదస్సు!
Bichkunda: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీసెర్చ్ మెథడాలజీపై అవగాహన సదస్సు. పరిశోధనల్లో ఏఐ (AI) ప్రాధాన్యతను వివరించిన ప్రొఫెసర్ అశోక్ త్రిపాఠి.
Bichkunda: పరిశోధన పద్ధతుల్లో వినూత్న మార్పులు.. విద్యావేత్తల సదస్సు!
Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి) బిచ్కుంద ప్రభుత్వ డిగ్రి కళాశాల (ఆట నమాస్) ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడలజి" అనే అంశం పై ఒకరోజు కార్యశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక్ అధ్యక్షత వహించి ప్రస్తుత కాలంలో పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఇలాంటి కార్యశాలలు, సెమినార్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు.
ముఖ్యంగా పరిశోధకులు , పిజి, తోపాటు యు జీ విద్యార్థులు పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. పరిశోధనలో సరైన ఫలితాలు సాధించాలంటే నాణ్యమైన ప్రామాణిక సాహిత్యాన్ని ఆధారంగా తీసుకోవడం అత్యంత అవసరమని ముఖ్య వక్తగా పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ అశోక్ త్రిపాటి పేర్కొన్నారు.
ఇలాంటి కార్యశాలలు విద్యార్థులకు విశేష సమాచారాన్ని అందించడంతోపాటు పరిశోధన పద్ధతుల పై ఆసక్తిని పెంపొందిస్తాయని , నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగ పడతాయని చెప్పారు.కృత్రిమ మేధ (AI) ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధనలను మెరుగు పర్చాలని సూచించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు శాలువాలు కప్పి,సన్మానంతో మెమంటోలతో సత్కరించారు.
కార్యశాల కార్యక్రమం లో పాల్గొన్న కార్యశాల సిబ్బంది.
బిచ్కుంద ప్రభుత్వ డిగ్రి కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు కార్యక్రమం లో ఎస్ ఆర్ ఎన్ కె బాన్సువాడ డిగ్రి కళాశాల ప్రిన్సిపల్ ఐ. గంగాధర్, రిసోర్చ్ పర్సన్ కె. గంగాధర్, తోపాటు కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.




