Kalwakurthy: అత్యాధునిక శస్త్రచికిత్సతో వినికిడి సాధించిన 8 ఏళ్ల బాలిక
Kalwakurthy: వినికిడి లోపంతో బాధపడుతున్న కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు మలక్‌పేట్ యశోదా ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక 'బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్' శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
Kalwakurthy: అత్యాధునిక శస్త్రచికిత్సతో వినికిడి సాధించిన 8 ఏళ్ల బాలిక
Kalwakurthy: పిల్లల్లో వినికిడి లోపం సమయానికి గుర్తించకపోతే మాటల అభివృద్ధి, చదువు, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మైక్రోటియా వంటి పరిస్థితుల్లో బయటి చెవి సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో, కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డా. రఘు కుమార్ ఎస్. చ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం అత్యాధునిక బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.
కుడి చెవిలో మైక్రోటియా కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న బాలికకు ఈ శస్త్రచికిత్స ద్వారా వినికిడి పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. గుండె ఆపకుండా చేసే బైపాస్‌ల తరహాలోనే, ఈ మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో శబ్ద తరంగాలను నేరుగా అంతర్గత చెవికి చేరేలా చేసి, బయటి చెవి లోపాన్ని అధిగమించేలా వైద్యులు చికిత్స అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాలికను ఐసీయూ పర్యవేక్షణలో ఉంచి, దశలవారీగా కోలుకునేలా చేశారు.
కొద్ది రోజుల్లోనే బాలిక ఆరోగ్యం మెరుగుపడి స్థిర స్థితికి చేరుకుంది. ఎటువంటి సమస్యలు లేకుండా డిశ్చార్జ్ చేయగా, ఫాలోఅప్ కోసం సూచనలు ఇచ్చారు. సమయానికి చికిత్స, ఆధునిక సాంకేతికత, నిపుణుల సమన్వయం వల్ల ఇలాంటి పిల్లల వినికిడి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని యశోదా ఆసుపత్రి వైద్యబృందం తెలిపింది. క్లిష్టతరమైన ఇ.ఎన్.టి వ్యాధుల చికిత్సలో తమ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో ముందంజలో ఉందని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు.




