Choppadandi: శాతవాహన వర్సిటీ ఈసీ సభ్యురాలిగా ఏలేటి కవిత

Choppadandi: శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన ఏలేటి కవిత కమలాకర్ రెడ్డి నియమితులయ్యారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 April 2026 4:50 PM IST
Choppadandi
X

Choppadandi: శాతవాహన వర్సిటీ ఈసీ సభ్యురాలిగా ఏలేటి కవిత

Choppadandi: శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన ఏలేటి కవిత కమలాకర్ రెడ్డి నియామకం కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆమె చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆమె సేవలు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్, అనుమాండ్ల అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని ఏలేటి కవిత కమలాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆమె నియామకాన్ని అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story