Nandus World: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందన అరెస్ట్

Nandus World: లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Sept 2026 2:49 PM IST
Nandus World
X

Nandus World: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందన అరెస్ట్

Nandus World: లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందన దంపతుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు. లండన్‌లో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి నందన దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఈ మోసాల వలయంలో చిక్కుకుని బాధితులు లబోదిబోమనడంతో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో సాగిన ఈ భారీ ఆర్థిక వసూళ్ల దందాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నందనపై ఉన్న కేసులు, లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story