Nandu’s World: లుకౌట్ సర్క్యులర్ ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతా.. పోలీసులను కోరిన యూట్యూబర్ రమానందన
Nandu’s World: ఆర్థిక మోసాల కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Nandu’s World: లుకౌట్ సర్క్యులర్ ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతా.. పోలీసులను కోరిన యూట్యూబర్ రమానందన
Nandu’s World: ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట మంగళవారం విచారణకు హాజరయ్యారు. తనపై ఉన్న లుకౌట్ సర్క్యులర్‌ను ఎత్తేస్తే తాను లండన్ వెళ్లిపోతానని ఆమె పోలీసులను కోరినట్లు సమాచారం. అలాగే తన భర్త మధుకర్ భారత్‌కు రాగానే ఆయనను విచారించాలని తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరుతో తమను మోసం చేశారంటూ క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 8న పోలీసులు విచారించినా ఆమె పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో, ఈ నెల 16న తిరిగి విచారణకు హాజరుకావాలని మరో నోటీసు జారీ చేశారు.
లాయర్ల సూచన మేరకు ఒకరోజు ముందే మంగళవారం స్టేషన్‌కు చేరుకున్న ఆమెను... మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆమె లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేసినట్లు సమాచారం.




