Koduru: తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించిన 15 అడుగుల కొండచిలువ!
Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం ఎస్టీ కాలనీలో 15 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. ఆత్మరక్షణ కోసం గ్రామస్థులు దానిపై దాడి చేయడంతో మృతి చెందింది.
Koduru: తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించిన 15 అడుగుల కొండచిలువ!
Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం ఎస్టీ కాలనీలో కొండచిలువ కలకలం రేపింది.నివాస గృహాల సమీపంలో కొండచిలువ సంచరిస్తోందని గిరిజనులు గుర్తించారు.ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న 15అడుగుల కొండచిలువను. చూసి మహిళలు భయంతో కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గిరిజనులు అక్కడికి చేరుకున్నారు.
పిల్లలు, మహిళలకు ప్రమాదం జరుగుతుందనే భయంతో ఆత్మరక్షణ కోసం కొండచిలువపై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో కొండచిలువ మృతి చెందింది. కొండచిలువ మృతితో గిరిజనులు ఊపిరిపించుకున్నారు.




