Renigunta: రేణిగుంట కిడ్స్ కింగ్డమ్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Renigunta: రేణిగుంట కిడ్స్ కింగ్డమ్ స్కూల్‌లో కరస్పాండెంట్ గౌసేబి ఆధ్వర్యంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
Renigunta: రేణిగుంట కిడ్స్ కింగ్డమ్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Renigunta: రేణిగుంట పట్టణంలోని కిడ్స్ కింగ్డమ్ స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ గౌసేబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి, కృష్ణాష్టమి విశిష్టతను తెలియజేసే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల సందడి, వేషధారణలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కరస్పాండెంట్ గౌసేబి మాట్లాడుతూ.. చిన్నారుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకల్లో పాఠశాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
Next Story




