Tondavada: తొండవాడ అగస్త్యేశ్వర ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ!

Tondavada: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గోశాల, అన్నదాన భవనాల నిర్మాణానికి ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి శంకుస్థాపన.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 20 Aug 2026 10:32 AM IST
Tondavada
X

Tondavada: తొండవాడ అగస్త్యేశ్వర ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ!

Tondavada: అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ ఉదయం 3:30 గంటలకు గోశాల నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు అన్నదాన భవన నిర్మాణానికి వేద పండితుల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఉదయం 10 గంటల నుంచి శ్రీ అగస్త్య మహాముని–లోపముద్ర దేవి ఆలయంలో మండల పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డితో పాటు తొండవాడ గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో గోశాల, అన్నదాన భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story