Renigunta: రేణిగుంట ఆసుపత్రిని వంద పడకలుగా మార్చాలి!

Renigunta: రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా, 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఐద్వా నేత కొండ్రెడ్డి ఈశ్వరమ్మ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 July 2026 5:02 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట ఆసుపత్రిని వంద పడకలుగా మార్చాలి!

Renigunta: రేణిగుంట ప్రభుత్వ హాస్పిటల్ ను "కమ్యూనిటీ హెల్త్ సెంటర్" గా మార్చాలని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు.గురువారం నాడు రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రిని పర్యటించి.డాక్టర్ చక్రపాణి ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ మాట్లాడుతూ..రేణిగుంట మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి సోమ,బుదు,శనివారం రోజుల్లో సుమారు 200 మందికి పైగా రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారని ఇలా ప్రతి నెల 6వేల మంది రోగులు ప్రభుత్వ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్నారని రేణిగుంట ప్రభుత్వ హాస్పిటల్ ను "కమ్యూనిటీ హెల్త్ సెంటర్" గా మార్చాలని తెలిపారు.

రేణిగుంట మండల జనాభా లక్ష మందికి చేరింది.రోగులు ప్రభుత్వ వైద్యం కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. రేణిగుంట ప్రభుత్వ హాస్పిటల్ 24 గంటలు ఉన్నదాన్ని 6 పడకల నుండి 30 పడకల ఆసుపత్రిగా "కమ్యూనిటీ హెల్త్ సెంటర్" హాస్పిటల్ గా మార్చాలి.నైట్ వాచ్ మెన్ ను హాస్పిటల్ క్లీనింగ్ మహిళను ఇద్దరిని నియమించాలి. రోగులకు త్రాగునీరు కుళాయిలు, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించాలి. రోగులు,గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలి.

రేణిగుంట ప్రభుత్వ హాస్పిటల్ కు చెందిన ఖాళీ స్థలం 4 ఎకరాల భూమిలో "100 పడకల ఆసుపత్రి" గా అభివృద్ధి చేయాలి.108 వాహనం ను ప్రభుత్వ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంచాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story