Naidupeta: నాయుడుపేట ఎమ్మెస్సార్ కాలనీలో కూటమి అభ్యర్థి షేక్ షాకీరా ప్రచారం!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో కూటమి చైర్పర్సన్ అభ్యర్థి షేక్ షాకీరా ఎన్నికల ప్రచారం. ఎమ్మెస్సార్ కాలనీలో విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఇంటింటి పర్యటన.
Naidupeta: నాయుడుపేట ఎమ్మెస్సార్ కాలనీలో కూటమి అభ్యర్థి షేక్ షాకీరా ప్రచారం!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కూటమి చైర్పర్సన్ అభ్యర్థిగా షేక్ షాకీరాను నిలబెట్టడం జరిగింది, అందులో భాగంగా ఎమ్మెస్సార్ కాలనీలో ఎన్నికల ప్రచారం లో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసనం భేటీ విజయ్ భాస్కర్ రెడ్డి తో పాటు చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ షాకీరా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు తమను ఈ స్థానిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని ఇప్పటికే ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పరిపాలన మరియు ఆర్థికంగా రాష్ట్ర ప్రజలను ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం తో ప్రజలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉండాలని తమకు తెలియజేస్తున్నారని నాయుడుపేట మున్సిపాలిటీలోని 32 వార్డులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గా పోటీ చేయుచున్న మొండెం. బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడూరు ప్రభావతమ్మ, టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, జనరల్ సెక్రెటరీ సుధీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




