Tirupati: తిరుపతిలో ఘనంగా ‘ఖేత్ బచావో అభియాన్’ సదస్సు
Tirupati: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఏఆర్ఎస్ తిరుపతి ఆధ్వర్యంలో రాస్ కేవీకే నందు అక్టోబర్ 30న ఖేత్ బచావో అభియాన్ సదస్సు ఘనంగా జరిగింది.
Tirupati: తిరుపతిలో ఘనంగా ‘ఖేత్ బచావో అభియాన్’ సదస్సు
Tirupati: ఆచార్య ఎన్. జి .రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము తిరుపతి ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ (పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) ను రాస్ కృషి విజ్ఞాన కేంద్రం నందు అక్టోబర్ 30వ తారీఖున తిరుపతి జిల్లా రైతాంగం కోసము నిర్వహించారు. డాక్టర్. వి.చంద్రిక, సహ పరిశోధన సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి వారు అధ్యక్షత వహించి నేల ఆరోగ్యము సంరక్షణ మీద అవగాహన కల్పించారు.
డాక్టర్ భాస్కర్ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త వివిధ పంటల మీద వచ్చే తెగుళ్ళను వాటి నియంత్రణ చర్యలను రైతులకు వివరించారు. డాక్టర్ కె.వి నాగ మాధురి, ప్రధాన శాస్త్రవేత్త నేల ఆరోగ్య పరీక్షలు- నేల ఆరోగ్య పత్రం ప్రాముఖ్యత గురించి తెలిపారు. డాక్టర్ ఏ రామకృష్ణారావు ఏరువాక కేంద్రం చిత్తూరు జిల్లా వారు రబీ పంటల మీద వచ్చే వివిధ పురుగుల నియంత్రణ, డాక్టర్ రవీంద్రారెడ్డి జీవనఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించారు.
రాస్ కె వి కె అధిపతి డాక్టర్ శ్రీనివాసులు సమగ్ర యాజమాన్యం నేల ఆరోగ్య పరిరక్షణ గురించి రైతులకు వివరించారు. శ్రీ రామాంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ ఆత్మవారు నేల ఆరోగ్య పరిరక్షణలో వివిధ పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డి రాము, డాక్టర్ వెంకటసుబ్బయ్య, డాక్టర్ బాల హుస్సేన్ రెడ్డి, డాక్టర్ భాగవతప్రియ, రాస్ కే. వి. కె శాస్త్రవేత్తలు, 150 మంది రైతులు మరియు 100 విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




