Renigunta: అన్నాసంపల్లి చెరువు కట్టకు ముమ్మరంగా మరమ్మతులు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అన్నాసంపల్లి చెరువు కట్టకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సూచనలతో టీడీపీ నాయకులు ముందస్తు మరమ్మతులు చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 14 Aug 2026 4:16 PM IST
Renigunta
X

Renigunta: అన్నాసంపల్లి చెరువు కట్టకు ముమ్మరంగా మరమ్మతులు!

రేణిగుంట: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సూచనల మేరకు రేణిగుంట మండలం అనాసంపల్లి గ్రామ పరిధిలోని చెరువు కట్టకు టీడీపీ నాయకులు మరమ్మతులు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో కట్టకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టితో కట్టను పటిష్టం చేస్తున్నారు.

కట్టపై పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగిస్తూ కట్ట బలహీనపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీడీపీ నాయకులు మునిరెడ్డి, యువనేత కుమార్‌రెడ్డి తెలిపారు. చెరువులో నీటి మట్టం పెరిగినా కట్టకు ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

అనాసంపల్లి చెరువు రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరనున్నట్లు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story