Tirupati: వడమాలపేటలో సెన్సస్ పర్యవేక్షణ.. అధికారులకు సీఎంఓ కమిషనర్ దిశానిర్దేశం
Tirupati: వడమాలపేటలో సెన్సస్ ప్రక్రియను పర్యవేక్షించిన ఏపీ సీఎంఓ కమిషనర్ ఎస్ఎస్ రావత్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు.
Tirupati: వడమాలపేటలో సెన్సస్ పర్యవేక్షణ.. అధికారులకు సీఎంఓ కమిషనర్ దిశానిర్దేశం
తిరుపతి జిల్లా: వడమాలపేట ఎంపీడీఓ కార్యాలయం నందు సెన్సస్ సమీక్ష లో ఏపీ రాష్ట్ర సీఎంఓ కమిషనర్. స్థానిక అధికారులతో సెన్సస్ ముఖాముఖ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర సీఎంఓ కమీషనర్ ఎస్ ఎస్ రావత్,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు.. అధికారయంత్రాంగం సెన్సెస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి,డేటాను కలెక్ట్ చేయాలి. వడమాలపేట ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన సెన్సస్ కార్యక్రమంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంఓ కమిషనర్ ఎస్ఎస్ రావత్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందంతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమ పురోగతిని పరిశీలిస్తూ, అధికారులు సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్భంగా సెన్సస్ నిర్వహణలో ఖచ్చితత్వం, సమయపాలన అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి కుటుంబ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారులు స్థానిక రామసముద్రం గ్రామానికి పర్యటించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో సెన్సస్ పనితీరును సమీక్షిస్తూ, చిన్నారులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులు చెప్పే ఇంగ్లీష్, తెలుగు రైమ్స్ లను ఆసక్తికరంగా ఆలపించారు. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.




