Renigunta: ఏపీలో దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె.. పెన్‌డౌన్‌కు సిద్ధం

Renigunta: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్‌డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 July 2026 9:07 AM IST
Renigunta
X

Renigunta: ఏపీలో దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె.. పెన్‌డౌన్‌కు సిద్ధం

Renigunta: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్‌డౌన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం (రిజిస్ట్రేషన్ నెం. 280/2014) పిలుపు మేరకు జూలై 20 నుంచి జూలై 31,2026 వరకు ఈ సమ్మె కొనసాగనున్నట్లు సంఘం ప్రకటించింది.

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు, కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజు తయారీ (డ్రాఫ్టింగ్) బాధ్యతలను కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జీవో నెం.396ను జారీ చేయడాన్ని దస్తావేజు లేఖరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ నిరసనగా పెన్‌డౌన్ చేపడుతున్నట్లు తెలిపారు.

ఆందోళనలో భాగంగా 12 రోజుల పాటు దస్తావేజుల తయారీ,

రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సేవలు దస్తావేజు లేఖరుల ద్వారా అందుబాటులో ఉండవని సంఘం వెల్లడించింది.దీంతో రిజిస్ట్రేషన్ సంబంధిత పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రభుత్వం వెంటనే జీవో నెం.396ను పునఃసమీక్షించి, దస్తావేజు లేఖరుల సమస్యలను పరిష్కరించాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story