Tirupati: అప్పలాయగుంటలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Tirupati: తిరుపతి జిల్లా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 July 2026 4:08 PM IST
Tirupati
X

Tirupati: అప్పలాయగుంటలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Tirupati: తిరుపతి జిల్లా, అప్పలాయిగుంట అత్యంత వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని చక్రసాన్నం. భక్తిశ్రద్ధలతో పురస్కారిణిలో సాన్నమాచరించిన శ్రీవారి భక్తులు. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన శ్రీవారి ఆలయ ప్రాంగణం.

అప్పలాయి గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి స్నపన తిరుమంజనం జరిపారు.

అనంతరం ఆలయ ఎదురుగా ఉన్న పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిగింది. రాత్రి 7 గంటల నుండి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story