Appalayagunta: తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలకు నగదు లెక్కింపు యంత్రాల విరాళం
Appalayagunta: తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలకు 2 నగదు లెక్కింపు యంత్రాలు విరాళం ఇచ్చిన తిరుపతి వీకేఆర్ఆర్ ఫ్యూయల్ స్టేషన్స్.
Appalayagunta: తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలకు నగదు లెక్కింపు యంత్రాల విరాళం
అప్పలాయగుంట: తిరుపతికి చెందిన వీకేఆర్ఆర్ ఫ్యూయల్ స్టేషన్ గ్రూప్స్ యజమాని మనోజ్ కుమార్ సోమవారం టీటీడీకి రెండు నగదు లెక్కింపు యంత్రాలను విరాళంగా అందించారు.
వీటిలో ఒక యంత్రాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి, మరొక యంత్రాన్ని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి కేటాయించారు.
ఈ యంత్రాలను తిరుచానూరు ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులకు అందజేశారు. త్వరలో రెండు ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల ద్వారా హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.




