Tiruchanur: తిరుచానూరులో ఆర్యవైశ్య మహిళల శ్రావణమాస పూజలు!
Tiruchanur: తిరుపతి రూరల్ పరిధిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా మహిళలు విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Tiruchanur: తిరుచానూరులో ఆర్యవైశ్య మహిళల శ్రావణమాస పూజలు!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘ పరిధిలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం కోసమే ఈ ప్రత్యేక పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రముఖులు, మహిళా విభాగం ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
Next Story




