Tirupati: కథనానికి స్పందన: రేణిగుంటలో ప్రమాదకర మార్గానికి పరిష్కారం!
Tirupati: హెచ్‌ఎంటీవీ కథనానికి స్పందించిన అధికారులు. రేణిగుంటలో ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలు పూడ్చి, కాలువపై తాత్కాలికంగా స్లాబ్‌ల ఏర్పాటు.
Tirupati: ప్రజా సమస్యలపై హెచ్‌ఎంటీవీ వెబ్ లో ప్రసారం చేసిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. రాకపోకలకు ఇబ్బందిగా మారిన మార్గంలో ప్రమాదకరంగా ఉన్న గుంతలు, కాలువపై స్లాబ్‌లను ఏర్పాటు చేసి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టారు.
కాలువపై స్లాబ్‌లు సరిగా లేకపోవడంతో స్థానికులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని హెచ్‌ఎంటీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు అక్కడ స్లాబ్‌లను అమర్చారు.
అయితే ఇది తాత్కాలిక పరిష్కారంగా కాకుండా కాలువకు శాశ్వతంగా స్లాబ్ ఏర్పాటు చేసి, మార్గాన్ని సక్రమంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. హెచ్‌ఎంటీవీ కథనంతో సమస్యపై అధికారులు స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




