Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఆటో యూనియన్ ధర్నా!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆటోల నుంచి జరుగుతున్న అక్రమ పార్కింగ్ వసూళ్లను నిలిపివేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 7 Oct 2026 6:55 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఆటో యూనియన్ ధర్నా!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ నాయకులు బుధవారం రైల్వే స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ ఆటో అండ్‌ మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ బాల, తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శివ మాట్లాడుతూ.. ప్రయాణికులను రైల్వే స్టేషన్‌కు తీసుకురావడం, అక్కడి నుంచి ఎక్కించుకుని వెళ్లే ఆటోలకు ప్రవేశ రుసుము వసూలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్కింగ్‌ పరిధి, వసూళ్లకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులను తీసుకువచ్చే, తీసుకెళ్లే వాహనాల నుంచి అనవసరంగా రుసుములు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

అనంతరం రైల్వే సీసీఐ అధికారి జగన్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అధికారి.. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌కు గతంలో పలుమార్లు పెనాల్టీలు విధించినట్లు తెలిపారు. సమస్యకు పరిష్కారంగా రెండు రోజుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, రైల్వే స్టేషన్‌లోకి వచ్చి వెళ్లేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు నాయకులు తెలిపారు. ఎవరైనా రుసుము చెల్లించాలని కోరితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారి సూచించినట్లు పేర్కొన్నారు.

అధికారి హామీతో ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు కార్తీక్‌, రమణ, సెల్వ, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు ఎస్.సురేష్‌, ఎం.వెంకటేష్‌, బి.ప్రమీల, కాశీ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA