Renigunta: కరకంబాడి పాఠశాలలో మొక్కలు నాటిన నేతలు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Renigunta: కరకంబాడి పాఠశాలలో మొక్కలు నాటిన నేతలు!
Renigunta: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా రేణిగుంట మండలం కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వన్నె కుల డైరెక్టర్ తేజోవతి, బీసీ నాయకులు బీడీ బాలాజీ ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టారు.
‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో బృహత్ వృక్షారోహణ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తేజోవతి సూచించారు.
కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజ హిత కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు.




