Srikalahasti: అయ్యప్ప ఆలయ మహా కుంభాభిషేకం దాతల సహాయం కోరుతున్న సమితి!

Srikalahasti: శ్రీకాళహస్తిలో తత్వమసీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక వేడుకలు ఆగస్టు 26, 27, 28 తేదీల్లో జరగనున్నాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 30 July 2026 8:15 AM IST
Srikalahasti
X

Srikalahasti: అయ్యప్ప ఆలయ మహా కుంభాభిషేకం దాతల సహాయం కోరుతున్న సమితి!

Srikalahasti: శబరిమల అయ్యప్ప స్వామివారి తత్వమసీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మాణంలో కొనసాగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ పనులు వేగంగా సాగుతున్నాయని సమితి ప్రతినిధులు తెలిపారు. ఆలయ నిర్మాణంలో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను రానున్న మహా కుంభాభిషేకానికి ముందే పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు.

సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఆగస్టు 26, 27, 28 తేదీల్లో మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించడం, మిగిలిన పనులను పూర్తి చేయడం ఆర్థికంగా భారంగా మారిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారి అనుగ్రహం పొందాలనే భక్తి భావంతో భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని సమితి విజ్ఞప్తి చేసింది. మహా కుంభాభిషేకానికి సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా విరాళాలు అందించి స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని కోరింది.

విరాళాల కోసం బ్యాంకు వివరాలు

- ఖాతా పేరు: శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసీ సేవా సమితి

- ఖాతా సంఖ్య: 437100140450001

- IFSC: TMBL0000437

వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9700257773

ఈ విజ్ఞప్తిని సమితి గౌరవ అధ్యక్షులు దేవకి బాలాజీ గురుస్వామి, అధ్యక్షులు మధు గురుస్వామి, వ్యవస్థాపకులు మరియు కార్యదర్శులు మురళి గురుస్వామి, మోహన్ గురుస్వామి, కోశాధికారి నాంబేటి సుధాకర్ గురుస్వామి విడుదల చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story