Naidupeta: సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయుడుపేటలో పాలాభిషేకం!
Naidupeta: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ నాయుడుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు.
Naidupeta: సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయుడుపేటలో పాలాభిషేకం!
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని టిడిపి కార్యాలయంలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, స్థానిక ఎన్నికలలో బీజీలకు 34% రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, బీసీలను అక్కున చేర్చుకునే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తెలియపరిచారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు చెందుతుందని అలాగే బీసీలను రాజకీయాలలో కొనసాగిస్తూ ఇప్పటివరకు బీసీలకు అవకాశాలు కల్పిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అలాంటి నాయకుడు స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం బీసీలకు రాజకీయాలలో అత్యధికంగా పాల్గొనే అవకాశం ఇవ్వడమేనని తెలియజేయడం జరిగింది.




